సోషల్ మీడియాలో కాదు.. అంతగా దేశభక్తి ఉంటే సైన్యంలో చేరి పోరాడండి’’ అని ఎయిర్‌ఫోర్స్ మాజీ అధికారి భార్య విజేత మందవ్‌గేన్ అన్నారు. గతవారం జమ్మూ కశ్మీర్‌లోని బుడ్గామ్‌లో ఎంఐ-17 వీ5 చాపర్ కూలి ఏడుగురు సైనికులు చనిపోయారు. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి నినాద్ మండవ్‌గేన్ భార్యే విజేత.
నినాద్ అంత్యక్రియలను మహారాష్ట్రలోని నాసిక్లో శుక్రవారం సైనిక గౌరవంతో నిర్వహించారు . కాగా ఆదివారం మీడియాతో మాట్లాడిన విజేత సోషల్ మీడియాకు యూజర్లకు గట్టి సందేశాన్ని ఇచ్చారు . “ సోషల్ మీడియా యూజర్లు దయచేసి నిగ్రహాన్ని పాటించండి . అనవసరంగా మనోభావాల్ని రెచ్చగొట్టొద్దు ” అని అన్నారు . ఇంకా ఆమె మాట్లాడుతూ “ సోషల్ మీడియా , పత్రికలు , టీవీల్లో చాలా జరుగుతుంటుంది . మీడియా ఒక్కోసారి బాధ్యతాయుతంగా ఉన్నట్లు నటిస్తుంది , ఒక్కోసారి అలా కూడా జరగదు . మీరు నినాదాలు బాగానే చేస్తారు . మీకు నిజంగా సమాజంలో మార్పు రావాలని కోరుకున్నట్లైతే నినాద్ , అభినందన్ లాగానే సైన్యంలో చేరిపోండి . లేదంటే మీ పిల్లల్ని చేర్చండి . అది కూడా చేయలేకపోతే మీ చుట్టూ ఉన్న పరిసరాలపై శ్రద్ద వహించంది .
రోడ్లను శుభ్రంగా ఉంచుకోండి . బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకండి . బాలికలపై అత్యాచారాలు చేయకండి ” అంటూ సోషల్ మీడియా , మీడియాపై విజేత ఆగ్రహాన్ని వెల్లగక్కారు .