తొమ్మిదో క్లాసులో లవ్ లో పడ్డా

సెలబ్రిటీలు కూడా తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమలో విఫలమై ఉంటారు. సినీ నటి తాప్సి కూడా ఓసారి ప్రేమలో విఫలమయ్యారట. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడునా సీనియర్‌తో మొదటిసారి ప్రేమలో పడ్డాను. నా స్నేహితులతో పోలిస్తే నా ప్రేమ వ్యవహారం కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. కానీ ఆ అబ్బాయి పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయని, చదువుకు ఆటంకం కలుగుతుందని చెప్పి నన్ను వదిలేశాడు.

“ ఆ సమయంలో మా వద్ద ఫోన్లు కూడా లేవు. మా ఇంటి వెనుక పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌ ఉండేది. రోజూ ఫోన్‌ చేసి “ఎందుకు నన్ను వదిలేస్తున్నావ్‌” ? అని బోరుమనేదాన్ని. ఈ విషయం నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను ప్రేమలో పడినప్పుడల్లా అతనే నా జీవితం అని ఊహించుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు నా ప్రేమ విఫలమైతే బహుశా నాకు కావాల్సిన వ్యక్తి అతను కాదేమో అనుకుంటూ నాకు నేను నచ్చజెప్పుకొంటాను’ అని వెల్లడించారు తాప్సి.