సౌత్ ఇండియన్ సినిమా ఇండ‌స్ట్రీలో ఇన్స్టాగ్రామ్ క్వీన్ ఎవ‌రైనా ఉన్నారా అంటే మ‌రో ఆలోచ‌న లేకుండా కాజల్ అగర్వాల్ పేరు చెప్పాల్సిందే. ఎందుకంటే అక్క‌డ కాజల్ కంటే తోపులు ఎవ‌రూ లేరు. అస‌లు కాజల్ ఫాలోయింగ్ చూసి అంతా ముక్కున వేలేసుకుంటారు. ఆ భామ‌కు సోష‌ల్ మీడియాలో ఆ స్థాయిలో క్రేజ్ ఉంది. మ‌హేష్ బాబు, సూర్య లాంటి స్టార్స్ కూడా ఈమె ముందు దిగ‌దుడుపే అంటే కాజల్రేంజ్ ఏంటో ఇట్టే అర్థ‌మైపోతుంది. ప్ర‌తీ ఫోటోను పోస్ట్ చేసి సోష‌ల్ మీడియాలో త‌న పాపులారిటీ మ‌రింత పెంచుకుంటుంది కాజల్..

సౌత్ హీరోయిన్లలో మొదటి సారి గా 10 మిలియన్ ఫాలోయర్ల ను సాధించింది కాజల్ …కాజల్ తర్వాత రెండో స్థానంలో రకుల్ ప్రీత్ కు 7.3 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్నారు. ఇక సమంతా కు 6.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు. కాజల్ 10 మిలియన్ మార్క్ సాధించిన సందర్భంగా “10 మిలియన్ ఇన్స్టా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు. అంటూ మెసేజ్ పెట్టింది.