అక్క గర్భవతి, బావపై మనసుపడిన చెల్లలు.. చివరికి జరిగిన దారుణం ఇది…

అక్క భర్తపై మనసు పడిందా యువతి. ఎలాగైనా బావను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. అడ్డుగా ఉన్న అక్కను ఎలాగైనా తప్పించాలనుకుంది. ఈ ఆలోచనే ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అక్క గర్భవతితో ఉందని కనికరం లేకుండా కత్తితో పలుమార్లు పొడిచి హతమార్చింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా కైత్రాలో జూలై 27న జరిగిందీ దారుణ సంఘటన. అభిలాష(27), షతక్షి (19) అక్కాచెల్లెళ్లు. అభిలాషకి కొద్ది నెలల క్రితం పెళ్లైంది. ఆమె గర్భవతి కావడంతో అమ్మనాన్నలతో పాటే ఉంటోంది. అయితే ఆమె భర్తపై షతక్షి వ్యామోహం పెంచుకుంది. ఎలాగైనా అతడిని దక్కించుకో వాలనుకుంది. ఇందులో భాగంగా వాష్‌రూంలో ఉన్న అక్కపై కత్తితో దాడి చేసింది. మెడపై కడుపులో విచక్షణా రహితంగా పొడిచింది. బాధితురాలి అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకొని తీవ్ర గాయాలపాలైన అభిలాషను ఆసుపత్రికి చేర్చారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను కాపాడలేకపోయినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఘటనా స్థలం నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అక్కపై షతక్షి హత్యాయత్నం చేయడం ఇది మూడోసారి అని పోలీసులు తెలిపారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here