పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. బద్రి సినిమా తో తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచమైన రేణు , ఆ తర్వాత జానీ చిత్రంలో మళ్లీ పవన్ సరసన నటించింది. అప్పటికే పవన్ , రేణు సహజీవనం చేయడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఇవన్నీ జరిగిపోయాయి. ప్రస్తుతం రేణు తన ఇద్దరి పిల్లలతో పుణేలో ఉంటుంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది.

అల్లు శిరీష్ “ABCD” ఫస్ట్ లుక్
ఇప్పుడేమో మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. “స్టువర్టుపురం” దొంగల్లో పేరు మోసినవాడైన టైగర్ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ‘టైగర్’ అనే సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘దొంగాట’ ఫేమ్ వంశీ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండగా , బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైగర్ నాగేశ్వర రావు పాత్రలో నటిస్తున్నాడట, రేణు దేశాయ్ టైగర్ పెద్దక్క పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది చూడాలి…