రోజు జిల్లా ఎస్.పి. కుమారి చందన దీప్తి ఐ.పి.ఎస్. గారు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో అడవిలో చెట్లు నరకడం, కలప అక్రమ రవాణా పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎస్.పి. గారు మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న చెక్ పోస్టుల నిర్వహణ మరియు ముఖ్యమైన చెక్ పోస్ట్ ల వద్ద అటవీ శాఖ అధికారులతో పాటు సాయుధ బలగాల బందోబస్తు ఏర్పాటు గురించి చర్చించినారు. అటవీ మరియు పొలిసుశాఖలు కలిసి సంయుక్త దాడులు చేస్తూ అడవిలో చెట్లు నరకడం, కలప అక్రమ రవాణా, వన్య ప్రాణుల వేటను చేసే వారిపైన కఠినమైన చాట్టాలను అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. అదేవిధంగా విద్యుత్ శాఖ సహకారంతో విద్యుత్ ఉపయోగించి వన్య ప్రాణుల వేట ని నిరోధానికి కృషిచేయాలని సూచించారు.

Advertisement

అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చెక్ పోస్టులు, ప్లయింగ్ స్క్వార్డ్స్ ఏర్పాటు చేసుకోవాలని, అక్రమ రవాణా కి ఉపయోగించే వాహనాలను తప్పక సీజ్ చేయాలని, బాద్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. అటవీ మరియు పోలీస్ రెండు శాఖలు సమన్వయం చాలా కీలకమని, అటవీశాఖ వారిక పోలీసు శాఖ నుండి ఏవిధమైన సహాయం కావాలంటే పోలీసు అధికారులతో సంప్రదింపు జరిపి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలపై ,అక్రమ స్మగ్లింగ్ లు నిరోధించాలని సూచించారు. చెక్ పోస్ట్ ల వద్ద అక్రమ రవాణా పూర్తిగా నిరోధించే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి పలు సూచనలు చేశారు. ఇంట్లో పెంచిన టేకు చెట్టు తరహా చెట్లు నరకడం , రవాణా చేయడం కోసం తీసుకోవలసిన అనుమతి కోసం ఆన్లైన్ లో అప్లై తప్పనిసరి అని సూచించారు. అటవీ శాఖ లో ఉన్న చట్టాలు, నేరం చేస్తే ఫారెస్ట్ యాక్ట్ (సెక్షన్ 20 ఫారెస్ట్ యాక్ట్) ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో జరిగిన అటవీశాఖ సంబంధిత కేసుల గురించి అడిగితెలుసుకున్నారు.

అటవీ శాఖకి చెందిన భూముల కబ్జా పై కఠినంగా వ్యవహరించాలని, గ్రామీణ ప్రాంతాలలో చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం కూడా అటవీ భూముల కబ్జా కి కారణం అవుతున్నాయని, కావున కొన్ని ముఖ్యమైన గ్రామాలు గ్రామ స్థాయిలో పలు అవగాహన సదస్సు లు, తరచుగా నేరాలు చేయు వ్యక్తులు గుర్తించి కౌన్సిలింగ్ లు నిర్వహించాలని, గ్రామాల్లో ఫ్లెక్సీ లు, బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రజల్లో సరైన అవగాహన కలిగించాలని, పోలీసు కళాబృందం ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ సరైన అవగాహన కి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ, అటవీ శాఖ సమన్వయం తో ముందుకెళ్తూ ప్రగతి సాధించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి. శ్రీ. డి. నాగరాజు గారు, మరియు మెదక్ డి.ఎస్.పి. కృష్ణమూర్తి, జిల్లా సి.ఐ. లు ఎస్.ఐ.లు పాల్గొన్నారు.