ఒంటరిగా వెళ్తున్న మహిళలే అతని టార్గెట్. వెనక నుంచి వెళ్లడం, హఠాత్తుగా ముద్దుపెట్టి పారిపోవడం. ఇలా కొన్ని రోజులుగా ఒంటరిగా వెళ్తున్న మహిళలను లైంగికంగా వేధిస్తున్న అతడి ఆట కట్టించారు పోలీసులు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని పతుంగా రైల్వే స్టేషన్ బ్రిడ్జిపై ఒంటరిగా వెళ్తున్న మహిళలను వెనక నుంచి వెళ్లి హత్తుకుంటాడు.

Advertisement

ముద్దుపెడతాడు వాళ్లు ఎదురు తిరిగే లోపే పారిపోతాడు. ఈ ఘటనను జనవరి 25న సీసీటీవి కెమెరా ద్వారా గుర్తించారు పోలీసులు. అందులో ఓ యువకుడు, తెల్లటి షర్ట్ బ్లూ జీన్స్ వేసుకున్న ఒకతను యువతి దగ్గరకు వెళ్లి వెనక నుంచి ముద్దు పెట్టుకోవడం కనిపిస్తుంది. షాక్ అయిన ఆ మహిళ ఎదురు తిరిగే లోపే అతను పారిపోయాడు.

ఇలా కొన్ని రోజులుగా మహిళలను వేధిస్తున్నట్లు గుర్తించారు. గురువారం ఓ దొంగతనం కేసులో అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే మహిళలు మాత్రం తమను వేధించారని ఫిర్యాదు చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మహిళలు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. ఎవరూ ఫిర్యాదు చేయకుంటే న్యాయపరంగా ముందుకెళ్తామన్నారు పోలీసులు.