అతిలోక సుందరి శ్రీదేవి ,పెద్ద వేషంలో చిన్న కూతురు.

గ్లామర్ ప్రపంచానికి మరో ఇద్దరు అతిలోక సుందరిలను ఇచ్చి వెళ్లింది. మొదటి కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే ‘దఢక్’ మూవీతో కుర్రకారు గుండెల్ని పిండేసింది. బాలీవుడ్‌లో శ్రీదేవి ముద్ర చెరిగిపోకుండా కాపాడతానంటూ ఆమె మరో కూతురు ఖుషీ కపూర్ కూడా ‘తయారైంది’! ఈసారి అక్కను తలదన్నేలా హొయలు పోతూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఖుషీ. బాలీవుడ్ కళ్ళు తన మీద పడ్డం కోసం అడపాదడపా తన వంతు ప్రయత్నం కూడా చేస్తోందామె!

ఇటీవల ఇటలీలో ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్ జరిగింది. తారాలోకం మొత్తం దిగివచ్చిన సదరు ఈవెంట్‌లో తనదైన స్టాంప్ వెయ్యాలనుకుందో ఏమో.. ఖుషీ.. స్పైసీ డ్రెస్‌తో అందరినీ అమితంగా ఆకట్టుకుంది. మెరిసేటి వెండి రంగులో ఆమె వేసుకున్న కాస్ట్యూమ్ మీద, ఆమె మీద అక్కడికక్కడే లోతైన టాక్ నడిచింది.
కట్ చేస్తే.. ఇప్పుడు ఖుషీ కపూర్ ఫోటో సోషల్ మీడియాను దున్నేస్తోంది. ఖుషీ బాగా ఎదిగిందండోయ్.. అంటూ కాంప్లిమెంట్లు పడిపోతున్నాయి. ఆమె కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా? సెల్యులాయిడ్ నుంచి ఖుషీ కోసం వెతుక్కుంటూ ఎన్ని ఛాన్సులొస్తాయన్నది చూడాలి!