జనగాం జిల్లా కొండకండ్ల మండలం రామన్నగూడెం గ్రామ శివారు ప్రాంతంలో నిన్నటి రోజున మద్యం యజమానిని తుపాకీతో బెదింరించి గాలిలోకి కాల్పులు జరిపి 6లక్షల70 వేల రూపాయల లాక్కేళ్ళిన సంఘటన పై పోలీస్ కమిషనర్ డా.వి. రవీందర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం అధికారులతో నేరం జరిగిన స్థలాన్ని సందర్శించి నేరం జరిగిన తీరుపై కమిషనర్ వెస్ట్ జోన్ డి.సి.పి శ్రీనివాసరెడ్డి , వర్డన్నపేట ఎ.సి.పి మధుసూదన్ అడిగితెలుసుకోవడంతో పాటు నేరానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు గాను అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగించాల్సి వుంటుంది. త్వరితగతిన నేరస్తులను పట్టుకోవాలని ప్రత్యేక దర్యాప్తు బృందాలకు పోలీస్ కమిషనర్ అదేశించారు.