{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":1,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579029106151","total_editor_time":69,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1579029106108","total_effects_time":0,"brushes_used":0,"height":750,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నాయకులుతమకు పార్టీ బీఫామ్ ఇవ్వనందుకు నిరసనగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే సకాలం పక్కనే ఉన్నవారు స్పందించి, వారిని వారించడం తో ప్రమాదం తప్పింది. జనగామ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార పార్టీ టికెట్ ఆశించిన గంగాభవాని అనే మహిళా నాయకురాలు, తనకు బీఫామ్ ఇవ్వనందుకు నిరసనగా, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి పార్టీ కండువాతో ఉరి పోసుకునే ప్రయత్నం చేశారు .

అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆమెను వారించి, ఆత్మహత్య ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఇక మేడ్చల్ లోను ఇదే పరిస్థితి నెలకొంది. విజయ్ అనే నాయకుడు టికెట్ రానందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇక సూర్యాపేట లోను అబ్దుల్ రహీమ్ అనే కార్యకర్త పార్టీ బీఫామ్ ఇవ్వకపోవడం ఇంట్లో ఉరి పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, సకాలం లో కుటుంబ సభ్యులు స్పందించి అతన్ని కాపాడారు. ఆదిలాబాద్ మాజీ చైర్మన్ మనీషా కు బీఫామ్ దక్కకపోవడం తో ఆమె నేడు తననామినేషన్ ఉపసంహరించుకున్నారు. అయితే పార్టీ టికెట్ దక్కకపోవడం పట్ల కన్నీటి పర్యంతమయ్యారు.

ఇక పార్టీ టికెట్ దక్కలేదని పలువురు పార్టీ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్, బీజేపీ కండువాలను కప్పుకున్నారు. నగర శివారు బడంగ్ పేట , మీర్ పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన పలువురు నాయకులు అధికార పార్టీ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించి, దక్కకపోవడంతో చేసేది లేక తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు .