{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":["add_photo_directory"],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":1,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":2,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578289932001","total_editor_time":199,"total_draw_time":40470,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578289931988","total_effects_time":0,"brushes_used":0,"height":701,"layers_used":2,"width":1242,"subsource":"done_button"}

కొందరు అధికారం చేతికి రాగానే మదమెక్కి ప్రవర్తిస్తారు. తన తోటి ఉద్యోగుల్ని, తన కిందస్ధాయి పనివాళ్లను కూడా చిన్న చూపు చూస్తున్నారు. తెలంగాణలో ఇలాంటి ఓ అమనుష ఘటనే చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని పి హెచ్ సి సెంటర్ అటెండర్ తో జిల్లా, Dmho అధికారి చంద్రశేఖర్ తన చెప్పులను క్లీన్ చేయించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చంద్రశేఖర్‌ అటెండర్‌ కనకయ్యతో చెప్పులు తుడిపించారు..

ఈ ఘటన తంగళపల్లి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో హాట్ టాపిక్ గా మారింది. అటెండర్ చెప్పులు తుడిచిన విషయంపై డి ఎం హెచ్ ఓ చంద్రశేఖర్ అధికారికి వివరణ కోరగా, చెప్పులపై క్యాండిల్ మరకలు పడ్డాయని అవి చూడమని చెప్పానని డిఎంహెచ్ఓ చెప్పడం కొసమెరుపు.

చెప్పులపై క్యాండిల్‌ మరకలు పడటంతో నేను తొలగిస్తుంటే అటెండర్‌ మధ్యలో కల్పించుకున్నాడు. చెప్పులను తీసుకుని వెళ్లాడు. నేను వారించిన కూడా అతడు వినలేదు. నా చెప్పులు తుడిపించే స్థాయికి దిగజారలేదు. ఆ ఫొటో ఎవరు తీశారో కూడా నాకు తీయలేదు. ఇంట్లో కూడా నా పనులు నేనే చేసుకుంటాను’ అని చంద్రశేఖర్‌ తెలిపారు. ఇటీవల యువకులను చితకబాదిన పోలీసులపై చర్యలు తీసుకున్న పై అధికారులు మరి ఈ విషయంలో సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువత్తుతున్నాయి. డీఎమ్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి..