భీమదేవరపల్లి(వరంగల్ అర్బన్): అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని ముస్తఫాపూర్‌ పరిధిలోని కొత్తపల్లి తండాలో మంగళవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం ధరావత్‌ రజిత(26) మంగళవారం ఉదయం తన వ్యవసాయబావి వద్దకు వెళ్ళి కనబడకపోవడంతో కుటుంబసభ్యులు బావిలో వెతికారు. రజిత బావిలో శవమై మృతిచెంది ఉండడంతో ముల్కనూర్‌ పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రజిత ప్రమాదవశాత్తు బావిలో పడిందా? లేక ఎవరైనా దాడి చేసి బావిలోకి నెట్టివేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  రజితది హత్య, ఆత్మహత్యా, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిందా అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ముల్కనూర్‌ ఎస్సై సూరి తెలిపారు.