లింగాలఘణపురం మండలం వడ్డిచర్ల గ్రామానికి చెందిన అన్నాచెళ్లెలిని జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు వరించాయి. నిరుపేద రైతు రేగు శ్రీశైలం-అనసూర్య దంపతులు కుమారుడు అమరేందర్, కుమార్తె అశ్వినిని కష్టపడి చదివించారు.
Advertisement
అమరేందర్ బీటెక్ పూర్తి చేయగా అశ్విని బీఎస్సీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. సోమవారం విడుదలైన ఫలితాల్లో జనగామ జిల్లా మెరిట్‌లిస్ట్‌లో 16వ స్థానంలో అశ్విని (హాల్ టికెట్ నెంబర్- 5448108), 24వ స్థానంలో అమరేందర్ (హాల్ టికెట్ నెంబర్- 5304164) ఎంపికయ్యారు. తమ పిల్లలిద్దరికీ ఉద్యోగాలు రావడంతో తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. వీరిని గ్రామస్థులు అభినందించారు.