ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన బింగి వెంకటేశ్వర్లు 46 మధిర డిపోలో ఆర్టీసీ కండక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. మధిర పట్టణానికి చెందిన ముగ్గురు ఫైనాన్సర్ తనకు తెలిసిన వ్యక్తులకు మధ్యవర్తిత్వం ద్వారా డబ్బులు ఇప్పించారు. తీసుకున్నవారు డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యవర్తి అయిన బింగి వెంకటేశ్వర్లపై మానసిక వేధింపులు, తీవ్ర ఒత్తిడి కారణంగా సొంత గ్రామం వేంసూరు మండలం కందుకూరుకి రెండు రోజుల క్రితం వచ్చి అక్కడే ఉంటున్నాడు.

గులకలు మందు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణమైన పేర్లు లెటర్ పై రాసి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె కుమారుడు ఉన్నారు. ఈ విషయంపై వేంసూరు మండలానికి చెందిన ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.