అభ్యర్థి ఇంట్లో రూ. 3.30 కోట్లు స్వాధీనం

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7 శుక్రవారం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు మద్యం, డబ్బులను విచ్చల విడిగా పంచుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్వాడ్ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ ఓటర్లకు పంచుతున్న డబ్బును స్వాధీనం చేసుకుటోంది.

వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి తరఫున బరిలో నిలిచిన ఎంఎల్ఏ అభ్యర్థి డా. పగిడిపాటి దేవయ్యకు చెందిన రూ.3.30 కోట్ల రూపాయలను ఎన్నికల ప్లయింగ్ స్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాజీపేట ఫాతిమనగర్‌లోని గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో ఓటర్లకు పంపణి చేసేందుకు డబ్బును సిద్ధంగా ఉంచారన్న సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఎన్నికల అధికారులు, పోలీసులు రూ. 3.30 కోట్లను స్వాధీనం చేసుకున్నారు..