అభ్యర్థులకు బస్సు సౌకర్యం …
జిల్లాలో రేపు నిర్వహించనున్న జూనియర్ పంచాయతీ సెక్రెటరీ పరీక్షకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్సుడిపో నుంచిభూపాలపల్లి లోకల్, గణపురం(ములుగు), ములుగులలోని పరీక్ష కేంద్రాలకు బుధవారం ఉదయం 6గంటల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు భూపాలపల్లి బస్సు డిపో మేనేజర్ లక్ష్మీధర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
అదేవిదంగా ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపూర్ (నూగూరు) మండలాల్లోని పరీక్ష కేంద్రాలకు కూడా ఏటూరునాగారం బస్ స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.