అమృతా, ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడతావా ?

మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ ఆత్మతో మాట్లాడిస్తామంటూ అతని భార్య అమృతను నమ్మించే ప్రయత్నం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన పొత్తూరు నాగారావు, సత్యప్రియ దంపతులు. ప్రణయ్‌ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నిన్న మిర్యాలగూడ వెళ్లారు.

ప్రణయ్‌ ఆత్మ మాతో మాట్లాడుతోంది. నీతోనూ మాట్లాడిస్తాం. వచ్చే జన్మలో కూడా ప్రణయ్‌ నీతోనే జీవించాలనుకుంటున్నాడు. నీ కోసం ఆయన ఆత్మ ఘోషిస్తూ మీ ఇంటిచుట్టే తిరుగుతోంది. మారుతీరావు, ప్రణయ్‌లు గత జన్మలోనే శత్రువులు. ఈ జన్మలో పగ తీర్చుకునేందుకు ప్రణయ్‌ని మారుతీరావు హత్య చేయించాడే తప్ప నిజమైన పగలేదు.’ అని అమృతకు చెప్పారు. ప్రణయ్‌ విగ్రహం పెట్టొద్దని. విగ్రహం పెడితే అతడి ఆత్మ ఆ విగ్రహంలోనే ఉండిపోతుందని అమృతతో అన్నారు. ఆ దంపతుల తీరును అనుమానించిన అమృత.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ దంపతులు అమృతతో ఎందుకిలా చెబుతున్నారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.