ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మిర్యాలగూడలో ఇటీవల దారుణహత్యకు గురైన ప్రణయ్‌ ఇంటి చుట్టూ కొందరు అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నరు అది, గమనించిన ప్రణయ్‌ భార్య, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కార్తీక్‌ టెక్స్‌టైల్స్‌కు చెందిన గున్నా వినోద్‌గా గుర్తించారు పోలీసులు.మిర్యాలగూడలోని ప్రణయ్‌ ఇంటి వద్ద అపరిచితుల సంచారం

పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రణయ్‌ భార్య అమృత. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వినోద్‌కుమార్‌ను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఈ సందర్భంలో అమృతతో పాటు ప్రణయ్‌ తల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వినోద్‌ ఏ ఉద్ధేశంతో తమ వివరాలు సేకరిస్తున్నాడో తెలుసుకోవాలని పోలీసులను కోరారు. వినోద్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణ పూర్తయిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ సదానాగరాజు తెలిపారు.