మాతృ దినోత్సవం పురస్కరించుకొని నర్సంపేట పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఎస్‌.జయకుమార్‌ బలపంపై తల్లి ఒడిలో శిశువును ఎత్తుకుని పాలు పడుతున్న చిత్తరువును ఎంతో అందంగా, అద్భుతంగా చెక్కి తన కళాప్రతిభను చాటుకున్నాడు. తాను చెక్కిన పాలు పడుతున్న మాతృమూర్తి చిత్తరువును మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం ఆయన స్వగ్రామంలో అతని తల్లి భద్రమ్మతో ఆవిష్కరింపజేసి ఆశీస్సులు పొందాడు. జయకుమార్‌ మాట్లాడుతూ మాతృమూర్తులకు సేవలందించి జన్మనిచ్చిన రుణాన్ని తీర్చుకోవడం కుమారుల బాధ్యతగా విన్నవిస్తూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.