అమ్మాయిల వాష్ రూంలో సెల్ తో షూట్
ఒకడు చిక్కాడు. మరొకడు పరార్ .

చీరాల పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో ఇద్దరు యువకులు వెకిలి చేష్టలకు పూనుకున్నారు. పట్టణంలోని మహిళా డిగ్రీ కాలేజీలో విద్యార్థినులు రైలు పట్టాల పక్కన నూతనంగా నిర్మించిన వాష్‌ రూమ్‌కు గురువారం మధ్యాహ్నం వెళ్లారు. గోడపై నుంచి ఇద్దరు యువకులు సెల్‌ఫోన్‌తో చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. గమనించిన విద్యార్థినులు పెద్దగా కేకలు వేయగా పరారయ్యేందుకు యత్నించారు.
ఇద్దరిలో ఒకరిని స్థానికులు పట్టుకుని కళాశాల అధ్యాపకులకు అప్పగించగా మరొకడు పరారయ్యాడు.

పట్టుబడిన యువకుడిని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. పట్టుబడిన యువకుడు ఒంగోలుకు చెందిన పాలపర్తి కార్తీక్‌గా గుర్తించారు. తన బాబాయిని చూసేందుకు చీరాల వచ్చానని చెబుతున్నాడు. పట్టుబడిన యువకుడి వద్ద ఎటువంటి సెల్‌ఫోన్‌లు దొరకలేదు. పరారైన మరో యువకుడి వివరాలు రాబట్టేందుకు విచారిస్తున్నట్లు ఒన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.రైలు పట్టాలు పక్కన ప్రహరీ వద్ద చిల్ల చెట్లు ఎక్కువగా ఉన్నాయి. మలవిసర్జనకు ఎక్కువ మంది ఆ వైపునకు వెళ్తుంటారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.