అమ్మాయిల స్నానాల గదిలో వామ్మో

అమ్మాయిల బాత్ రూమ్స్ లో రహస్య కెమేరాలను అమర్చి అందులో రికార్డ్ అయ్యే వీడియోల ఆధారంగా విద్యార్థినులను బెదిరించి లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలపై సిద్ధార్థ (21) అనే ఇంజినీరింగ్‌ విద్యార్థిని పరప్పన అగ్రహార ఠాణా పోలీసులు అరెస్టు చేశారు.

తమిళనాడుకు చెందిన ఈ విద్యార్థి చూడసంద్ర వద్ద ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్‌లో ఉంటున్న అతను పక్క భవంతిలోని విద్యార్థినుల హాస్టల్ స్నానాల గదిలో కెమేరాను పెట్టాడు. అతని స్నేహితురాలే ఈ కెమేరాను అమర్చిందని ప్రాథమిక విచారణలో గుర్తించారు. మొదట ఓ విద్యార్థినిని ప్రేమ పేరిట వంచించాడు. హోటల్‌ గదికి తోడ్కొని వెళ్లి ఆమెతో సన్నిహితంగా గడిపాడు.

దాన్ని తన మొబైల్ కెమేరాతో రికార్డు చేసుకున్నాడు. దాన్ని అడ్డు పెట్టుకుని, ఆమెను బెదిరించి, స్నానాల గదిలో రహస్య కెమేరాను పెట్టించాడని పోలీసుల విచారణలో తేలింది. కెమేరాలో నమోదవుతున్న వీడియోలను సేకరించి, వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసేవాడు. ఓ బాధిత విద్యార్థిని దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.

Also Read:

బీటెక్ దొంగ… లేడీస్‌ హాస్టళ్లలో

అతని నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ తీవ్రం చేశారు.