‘అమ్మ లేకుండా నేను జీవించలెను

అమ్మే నా ప్రాణం ! అన్నాడు !!
మరికొద్ది గంటల్లో తల్లి మరణం ఖాయమని తెలిసి ఆమెకంటే ముందే ఓ కొడుకు చనిపోయాడు. రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ విషాదకర ఘటన నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, అప్పాజిపేట గ్రామానికి చెందిన మర్రి భానుమతి అలియాస్‌ ఇద్దమ్మ (65) పక్షవాతంతో మంచాన పడింది. నోటి మాట రావడంలేదు. మరణానికి దగ్గరలో ఉం ది. కొద్దిగంటల్లో ప్రాణం పోతుందని భావించిన కుమారుడు ప్రకాశ్‌ (30) తల్లి లేని జీవితం ఊహించలేనని, అమ్మలేకుండా తాను బతకనని నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం సమీపంలోనిద రైలు పట్టాలపై పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కుమారుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తల్లి ఇద్దమ్మకు చెప్పారు. దీంతో ఆమె మంచంలోనే ప్రాణం విడిచింది. 
ప్రకాశ్‌ ఇంటి నిర్మాణ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచూ తన అమ్మ అనారోగ్యంపై చర్చించేవాడని స్నేహితులు తెలిపా రు. అమ్మలేకుండా బతకలేనని చెప్పినట్లు గ్రామస్తులు చెబుతున్నారు….