నాన్నేమో చావుకు ముహూర్తంపెట్టాడు..
అమ్మా

వినాయకచవితి పండుగ ఎలాచెయ్యాలో అడిగితె చెప్పావు.

నాభర్త , నేను వినాయక పూజ చేసాము.. భర్తతో కలిసి పండుగ ఎలా చెయ్యాలో వువ్వు చెప్పిన 24 గంటల్లో నాన్న మారణహోమం ఇలాఉంటుందని చూపించాడు. అంటూ అమృత పడుతున్న వేదన కన్నీరు తెప్పించేది. తనకోసం హిందూసాంప్రదాయంలో ప్రణయ్ ఇంట్లోనే పండుగ చేసేవారమని అమృత చెబుతొంది. తమప్రేమ వ్యవహారం తండ్రికి మొదటినుంచి తెలుసని , కొత్తగా ఆయనకు తెలిసి షాక్ అయి చేసిన పనికాదని ,పదకంప్రకారమే తనభర్తను చంపించి కన్నతండ్రే తన కుంకుమ చెరిపేశారని రోదిస్తోంది.

తన ఐదోతనాన్ని కబళించిన తండ్రికి శిక్ష పడాల్సిందేనని , తన కళ్ళముందు కనబడితే తండ్రిని చంపేస్తానని చెబుతొంది.. ప్రణయ్ అంత్యక్రియల సందర్భంగా అమృత గుండెలు అవిసేలా రోదిస్తున్న తీరు అందరినీ కంటతడిపెట్టించింది..