ప్యాంటు మీద ప్యాంటు ఇలా ఎనిమిది ప్యాంట్లు వేసుకొని జారుకోబోయిన అమ్మాయిని షాపు సిబ్బంది పట్టేశారు.
వెనిజులాలో ఓ యువతి వస్త్ర దుకాణానికి వెళ్లింది. అక్కడ జీన్స్‌ ర్యాక్‌ వద్దకు వెళ్లి 8 ప్యాంట్లు తీసుకొని డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఒకదాని మీద ఒకటి ధరించి చోరీ చేసేందుకు యత్నించింది.
కాగా, యువతి ప్రవర్తనపై అనుమానం కలిగిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డగించి వాష్‌రూమ్‌కు తీసుకెళ్లారు. ఆమె వేసుకున్న ప్యాంట్‌ను విప్పమన్నారు. దీంతో సదరు యువతి ఒక్కొక్క ప్యాంట్‌ విప్పుతూ మొత్తం 8ప్యాంట్లను బయటికి తీయడంతో సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.