తప్పుచేస్తే దేవుడైనా క్షమించడేమో కానీ తల్లి మాత్రం క్షమిస్తుంది. అమ్మంటే అంతులేని ప్రేమకు నిదర్శనం. కొడుకు తప్పు చేసినా తనను తీవ్రంగా కొట్టినా ఆ తల్లి కన్నపేగు బంధాన్ని మర్చిపోలేదు. అయితే ఆ కసాయి కొడుకు కన్నప్రేమను లెక్కచేయలేదు. బెంగళూరు జేపీ నగర్లో తల్లిని తీవ్రంగా హింసించిన 17ఏళ్ల యువకుడి ఉదంతం సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లిని ఫిర్యాదు చేయమని అడిగితే ఆమె కొడుకు మీద ఫిర్యాదు చేసేందుకు నిరాకరించింది. తన కొడుకుని తాను మార్చుకుంటానని ఈ విషయంలో పోలీస్ జోక్యం వద్దంటూ ప్రాధేయపడింది. అయితే ఈ దుర్మార్గుడు మైనర్ అయినా వాడి దురలవాట్లలో మహా ముదురు. మద్యం, పొగతాగడం, అమ్మాయిల స్నేహం.

ఇలా వాడికి లేని చెడు అలవాట్లు లేవు. వీటికోసమే తల్లి చీపురు కట్టతో దారుణంగా కొడుతుండగా కుటుంబ సభ్యులు వీడియో తీసి వాడికి బుద్ది వస్తుందేమోనని సోషల్ మీడియాలో పెట్టారు. అయితే తల్లిప్రేమ ఆ నీచుడ్ని క్షమించింది.