అర్ధరాత్రి సమయాల్లో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా డీజే సెట్లు, బ్యాండ్ ను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇటీవల కాలంలో అర్ధరాత్రి సమయాల్లో పెళ్ళి ఉరేగింపులో ఏర్పాటు చేస్తున్న డీ.జే సెట్ తో పాటు బ్యాండ్ వాయిద్యాల వినియోగం అధికంకావడంతో పాటు అధిక శబ్ధాల కారణంగా ప్రజలతో పాటు వ్యాధిగ్రస్తుల ఇబ్బందులకు గురౌవుతుందడంతో అర్థరాత్రి వేళల్లో 100 డయల్ ద్వారా ఫిర్యాదుల సంఖ్య అధికం కావడంతో ఈ సమస్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలకై పోలీస్ కమిషనర్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాలోని డి.జె, బ్యాండ్ వాయిద్యకారులు, ఆర్కిస్టాలు బృందాలతో పోలీస్ కమిషనర్ మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేక సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా డి.జే. బ్యాండ్ వాయిద్యకారులు, ఆర్కెస్టాలు యజమానులతో ముచ్చటించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ: ఆర్ధరాతి సమయమాల్లో డీ.జే వినియోగించడం ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తుండడంతో ఇకపై డీ.జే ఇతర వాయిద్య బృందాలు వారు సైతం తప్పని సరిగా సమయపాలన పాటించాల్సి వుంటుందని. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అనుసరించి రాత్రి పది తరువాత ఎలాంటి సౌండ్బాక్సు వినియోగించడం, వాయిద్యలను ఉపయోగించరాదు కాని వీటిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల స్థితిగుతులను దృష్టిలో వుంచుకోని రాత్రి 12 గంటల లోపు శుభకార్యములకు, ఉరేగింపులకు డీ.జీ, బ్యాండ్ వాయిద్యకారులు, అరికెష్టాలు వినియోగించుకోనేందుకు వెసులుబాటు కల్పించడం జరుగుతోందని, ఇచ్చిన గురువు అనంతరం ఒక్క నిమిషం ఆలస్యం అయిన డీ.జే. సామాను, ఇందుకోసం వినియోగిస్తున్న వాహనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో పాటు, డీజే: యాజమాని, డీజే వినియోగించుకుంటున్న వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేయబడుతుందని. ఇదే రీతిలో ఇతర వాయిద్య బృందాలకు కూడా వర్తిస్తుందని.

అలాగే డీజే వినియోగం కోసం చేసే పైరవీలకు తావు లేదని. ముఖ్యంగా శుభకార్యాలకు డీజే, బ్యాండ్ వాయిద్యాలు వినియోగించుకోనే వ్యక్తులకు ముందస్తుగానే పోలీసులు నిబంధనలను తెలియపర్చాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే ఎవరైన శబ్దకాలుష్యానికి గురిచేస్తూ డీజే. వినియోగిస్తున్నట్లయితే తక్షణమే డయల 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు అబ్దుల్బారీ, కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి తిరుమల్, ఇన్సెస్పెక్టర్లు. సతీష్బాబు, రాంబాబుతో పాటు సెంట్రల్, ఈస్ట్ జోన్ పరిధిలోని ఇన్సెస్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.