వరంగల్ : ట్రై సిటీస్ వరంగల్-హన్మకొండ- కాజీపేట్‌లలో అర్ధరాత్రి దోపిడీ గ్యాంగులు హల్‌చల్ చేశాయి. పలు కాలనీల్లో తిరుగుతూ దొంగతనాలు చేసేందుకు యత్నించాయి. ఈ క్రమంలో దొంగల ముఠా కదలికలకు సంబంధించిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు రాష్ట్రంలో సంచరిస్తున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. అనుమానితుల సంచారం ఉంటే గనుక వెంటనే 100కి కాల్‌చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విఙ్ఞప్తి చేస్తున్నారు.