తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చాలా మంది టాలెంట్ ఉన్న వారిని ప్రేక్షకులకు పరిచయం చేసింది కానీ వారిలో బిగ్ బాస్ తరువాత సక్సెస్ అందుకున్న వారు చాలా తక్కువ మంది. బిగ్ బాస్ తర్వాత కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలు చేస్తున్న వారిలో దివి వైద్య కూడా ఒకరు. ఈ మధ్యనే మెగాస్టర్ చిరంజీవి హీరోగా నటించిన “గాడ్ ఫాదర్” సినిమాలో కీలక పాత్రలో కనిపించింది దివి. కేవలం అందాల ఆరబోతకు మాత్రమే పరిమితం అవ్వకుండా ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో నెగిటివ్ షేడ్స్ కూడా చూపిస్తూ దివి ఈ సినిమాతో మంచి మార్కులు వేయించుకుంది. ఇకపై కూడా దివి అలాంటి ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ఈమె నటించిన వెబ్ సిరీస్ ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఈ మధ్యనే దివి “ఏటీఎం” అనే ఒక వెబ్ సిరీస్ లో కనిపించింది.

అందులో ప్రెస్ మీట్ సన్నివేశంలో ఆమె తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరూ దృష్టిని బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత మాత్రం ఆమె పాత్ర ఫెయిడౌట్ అయిపోయింది. ఈ వెబ్ సిరీస్ లో ఒక గ్యాంగ్ నెంబర్ కి లవర్ గా నటించిన దివి రెండు మూడు లిప్ లాక్ సన్నివేశాలలో కనిపించింది. ఇలా కేవలం ముద్దు సన్నివేశాలలో మాత్రమే కనిపించి మాయమైపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇలాంటి పాత్రలు కాకుండా మంచి పాత్రలు చేస్తే బాగుంటుందని అలాంటి పాత్రలలో ఆమెను చూడాలని అనుకుంటున్నట్లు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇకనైనా దివి తన స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి.