{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578657464371","total_editor_time":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578657289161","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

వరంగల్ నగర పరిశు భ్రతే అంత్యంత ముఖ్యమైన అంశమని , అవసరమైతే నగరం కోసం తాను కూడా రోడ్లను ఊడుస్తానని జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ పమేలా అన్నారు . పారిశుధ్యం విష యంలో ప్రజలకు మెరుగైన సేవలందించడంలో రాజీ లేదని ఆమె ప్రకటించారు . గురువారం జీడబ్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రజారోగ్య సిబ్బందితో కమిషనర్ సమీక్ష జరిపారు . ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ: నగర పరిశుభ్రతలో కార్మి కులు , జవాన్లు , శానిటరీ ఇన్ స్పెక్టర్లు, అధికారులు బాధ్యాతాయుతంగా మెలగాలని అన్నారు. ప్రస్తుతం నగర పారిశుధ్య సేవలు సంతృప్తికరం గా లేవని, నెల రోజుల్లో మార్పు కనిపించకుంటే కఠిన చర్యలు ఉంటా యని ఆమె హెచ్చరించారు.

కార్మికులతో వేడుకల్లో పాల్గొన్నా :

Advertisement

నూతన సంవత్సర వేడుకల్లో తాను కార్మికులతో పాలు పంచుకున్నానని కమిషనర్ పమేలా సత్పతి గుర్తు చేశారు. విధి నిర్వహణకు సొంత వ్యవహారాలకు ముడి పెట్ట వద్దనేది స్పష్టం చేసేందుకే ఈ విషయం చెబుతున్నానని అన్నారు. కార్మికులు విధులుకు గైర్హాజరైతే జవాన్లు కూడా ఊడ్వాలని స్పష్టం చేశారు.

అవసరమైతే తాను కూడా స్వీపింగ్ చేస్తానని అన్నారు. బయోమెట్రిక్ లో హాజరు వేసి విధులకు డుమ్మా కొట్టే వారిపై తన దృష్టి ఉందన్నారు. పద్ధతి మార్చుకోకపోతే ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. ప్రతి రోజు ఉదయం 5 గంటలకే క్షేత్ర స్థాయిలో ఉండాలని , తాను కూడా అదే సమయంలో ఉం టానని వెల్లడించారు. హాజరు వేసి కార్మికులు డుమ్మా కొడితే జవాన్లు బాధ్యులవుతారని, జవాన్లు వక్రమార్గాలకు పాల్పడితే శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇదే రీతిలో అధికారులు, ఎంహెచ్ వోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు..