స్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలు నిర్వహించకుండా

ఎల్కతుర్తికి చెందిన ఏరువ లద్దమ్మ – లుర్దురెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరిలో ఓ కుమార్తె గతంలోనే మృతి చెందింది. వీరికి మూడెకరాల 16 గుంటల భూమి ఉంది. ఇందులో నుంచి లుర్దురెడ్డి తన ముగ్గురు కుమారులు, కుమార్తె అన్న మేరి పేరున 20 గుంటల చొప్పున రెండు ఎకరాలను నలుగురి పేరు మీద రాసి, మిగతా భూమి తమను ఎవరైతే చేసుకుంటారో వారికే చెందుతుందని వీలునామా రాశారు.

5 సంవత్సరాల క్రితం లుర్దురెడ్డి మృతి చెందడంతో ఈ వీలునామాలు బయటకు వచ్చినట్లు చెప్తున్నారు. దీంతో ఆడబిడ్డకు పెళ్లి సమయంలోనే కట్నకానుకలు ఇచ్చామని, ఇప్పుడు ఆస్తి ఇవ్వడం సాధ్యం కాదని లుర్దురెడ్డి పెద్ద కుమారుడు శౌరిరెడ్డి, చిన్న కుమారుడు ఆరోగ్యరెడ్డి కోర్టును ఆశ్రయించారు. అయితే శనివారం ఉదయం వీరి తల్లి లద్దమ్మ (70) అనారోగ్యంతో మృతి చెందింది. ఈ క్రమంలో ఆస్తి పంపకాల విషయం తేలే వరకు అంత్యక్రియలు నిర్వహించొద్దని ఇద్దరు కుమారులు అంత్యక్రియలను జరగనివ్వలేదు.

ఈ క్రమంలో రెండో కుమారుడైన చిన్నపురెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని పట్టుపట్టాడు. దీంతో ఆదివారం బంధువులు 100 నంబర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎల్కతుర్తి ఎస్సై శ్రీధర్ సంఘటనా స్థలికి చేరుకొని కుమారులతో మాట్లాడి లద్దమ్మ అంతిమ సంస్కారాలు జరిపేలా చూశారు. ఇదిలా ఉండగా ఆస్తి కోసం కుమారులు తల్లి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడడం పట్ల సర్వత్రా చర్చనీయాంశమైంది….