ఆకస్మికంగా మరణించిన పోలీస్‌ అధికారుల కుటుంబాలకు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ విభాగం విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మరణించిన పోలీస్‌ అధికారుల కుటుంబాలకు శనివారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డా. వి.రవీందర్‌ అర్థిక సాయం అందించారు. వరంగల్‌ కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌ విభాగం నందు ఎస్‌.ఐగా విధులు నిర్వహిస్తు గత జులై మాసంలో అనారోగ్యంతో మరణించిన యం. రాజమౌళి, కేయూసి ఎ.ఎస్‌.ఐగా విధులు నిర్వహించి సెప్టెంబర్‌ మాసంలో మరణించిన బి. దుర్గా ప్రసాద్‌ కుటుంబాలకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ అధికారులు, సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన చేయూత పథకం ద్వారా మరణించిన పోలీస్‌ అధికారుల ఇరువురు కుటుంబాలకు లక్షన్నర రూపాయల చోప్పున ఆర్థిక సాయాన్ని పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా మరణించిన ఎస్‌.ఐ సతీమణి అనుషా, ఏ.ఎస్‌.ఐ సతీమణి దుర్గా ప్రసన్నలకు అందజేసారు.

ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మరణించిన పోలీస్‌ అధికారుల కుటుంబాల స్థితి గతులను అడిగితెలుసుకోవడంతో పాటు, శాఖపరంగా ఏలాంటి సమస్యలు వున్న తన దృష్టికి తీసుకావల్సిందిగా పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ గౌడ్‌కు సూచించారు.