{"effects_tried":0,"photos_added":0,"origin":"gallery","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578843473215","total_editor_time":113,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1578843473003","total_effects_time":0,"brushes_used":0,"height":702,"layers_used":0,"width":1242,"subsource":"done_button"}

ఆడియో టేపుల వ్యవహారంపై దుమారం రేగడంతో SVBC ఛైర్మన్ పదవికి పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. మహిళా ఉద్యోగితో రొమాంటిక్‌గా మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ వ్యవహారంపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకోవాల్సిందిగా అల్టిమేటం జారీ చేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్‌ను టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించారు. దాంతో ఆయన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలను గౌరవిస్తూ రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
నాపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతున్నా.

సంక్రాంతి సమయంలో నా కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. నా వాయిస్ మార్ఫింగ్ చేశారు. నన్ను కొందరు దెబ్బకొట్టాలని చూశారు. పద్మావతి గెస్ట్ హౌస్‌లో మందు కొట్టాననడం అవాస్తవం. ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం. పృథ్వీ రాజ్
ఎస్వీబీసీ చైర్మన్, 30 ఇయర్స్ పృథ్వీ తీవ్ర వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.

ఓ మహిళా ఉద్యోగినితో ఆయన సరస సంభాషణ జరిపినట్టు వెలుగులోకి వచ్చింది. ఓ ఉద్యోగినితో మద్యం తాగాలని తాను కోరుకుంటున్నట్టు, కౌగించుకుందామని అనుకున్నట్టు చెప్పిన విషయాలు బహిర్గతం అయ్యాయి. ఆ ఉద్యోగినితో పృథ్వీ జరిపిన సంభాషణల ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తప్పించాలని శ్రీవారి భక్తులు, నెటిజన్లు, మహిళా సంఘాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.