ఆపన్న హస్తం అందించిన ములుగు సబ్ రిజిస్ట్రార్.
పేరుకు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కానీ మానవత దృక్పథంలో ఆమె మరో మదర్ తెరిస్సా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండల కేంద్రంలో నిత్యం భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్న పిట్టల రమేష్, పద్మకు ఈ రోజు ఉదయం రోడ్డు మీదే ప్రసవం కావడం జరిగింది. భిక్షాటన చేస్తున్న వారిని ఎంతో మంది చూస్తున్నారు కానీ,ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో వారిని చేరతీయడం లేదు. రమేష్ కి ఏమి చేయాలో అర్థం కావడం లేదు,కనీసం హాస్పటల్ కి తీసుకెళదాం అన్న ఒక్క పైసా కూడా లేదు.
అప్పుడే ఇదంతా చూస్తున్న ఒక వ్యక్తి ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గారికి ఫోన్ చేసి ఈ పరిస్థితి గురుంచి చెప్పడం జరిగింది. సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు తస్లీమా గారు వచ్చాక వాళ్ళ బీద పరిస్థితిని చూసి చలించి పోయారు. అప్పుడే పుట్టిన ఆ పాపకు మెడికల్ కిట్టు, స్వేట్టర్, దుప్పట్లు, రమేష్ పద్మ లకు కొంత ఆర్ధిక సహాయం సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసారు. భవిష్యత్తు లో మీకు ఎటువంటి ఆపద వచ్చినా, ఆ పాప కు భవిష్యత్తు లో చదువుకు ఎటువంటి అవసరాలు వచ్చినా, సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ మీతో ఉంటుంది అని హామీ ఇచ్చారు.