• మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి..
  • హాస్పిటల్ కు వెళ్లి, దయాకర్ రెడ్డి సతీమణి సీతా దయాకర్ రెడ్డిని పరామర్శించి, ఓదార్చిన మంత్రి..

హైదరాబాద్, జూన్ 13: తన అప్త మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి చెందడంతో తాను మంచి ఆప్త మిత్రుడిని కోల్పోయానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏఐజి హాస్పిటల్ లో కొత్తకోట దయాకర్ రెడ్డి పార్థీవ దేహాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కంట తడి పెట్టారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. దయాకర్ రెడ్డి సతీమణి, మాజీ ఎమ్మెల్యే, మహబూబ్నగర్ zp మాజీ చైర్ పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ని మంత్రి ఎర్రబెల్లి పరామర్శించి, ఓదార్చారు. ధైర్యం చెప్పారు.