షాపులు పెట్టుకునేంత స్తోమత లేని వాళ్ళు, రోడ్డు పక్కన కొంచెం జాగా చూసుకొని చిన్నచిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కొన్ని పైసలు సంపాదించుకొని ఇంటికి పోతుంటారు. చిన్నదైనా పెద్దదైన ఒకే చోట దుకాణం పెట్టుకునేందుకు వీలు లేని వాళ్ళు, ఒక నాలుగు చక్రాల బండిని నెట్టుకుంటూ లేదంటే రిక్షా లాగా తయారు చేసుకున్న వాహనాల్లో వస్తువుల అమ్మకానికి వాడుకుంటారు. ఈ చిరు జీవుల మీద పోలీసులు లాటీ జులుం చూపిస్తుంటారు. అధికారులు అరిచి తరిమేస్తూ ఉంటారు ఇదంతా మనం చూసే ఉంటాం.

ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు నోయిడాలో కొంత మంది ఫుట్ పాత్ వ్యాపారస్తులు, ఒక ఫైన్ మాని ఒక మున్సిపాలిటీ ఆఫీసర్ ఆ ప్రాంతానికి వచ్చాడు, అక్కడ కూరగాయలు పెట్టుకొని అమ్ముకుంటున్న వాళ్ళని, పండ్లనుకుంటున్న వాళ్ల మీద ఇంత ఎత్తున ఎగిరిపడ్డారు, తక్షణం ఖాళీ చేయండి అంటూ అరుస్తూ ముందుకు కదిలాడు. ఆ చిరుజీవుల మీద తన ప్రతాపం చూస్తూ ముందుకు కలిగిన కదిలిన ఆ ఆఫీసర్ కి బండిమీద కాఫీ టిఫిన్ లో పెట్టుకుంటున్న ఒక వ్యక్తి తారసపడ్డాడు, ఇది చుసి రెచ్చిపోయిన ఆ ఆఫీసర్ ముందుకు ఉరికి ఆ బండిని బలంగా తోసేసాడు. టిఫిన్ తయారీ వస్తువులన్నీ దిగువన పడిపోవడంతో నివ్వరపోయిన ఆ టిఫిన్ వాళకు కడుపు మండిపోయింది. కళ్ళముందే కడుపు నిండా అన్నం పెట్టే వస్తువులన్నీ బోర్లా పడిపోవడం చూసి కోపం తన్నుకు వచ్చింది, ఎదుటివాడు ఎంత పెద్ద ఆఫీసర్ అన్న విషయం పక్కన పెట్టి ఆ చట్నీ డ్రమ్మును బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తుకున్న ప్రభాస్ లాగే పైకి ఎత్తుకున్నాడు.

పరిగెత్తి పారిపోతున్న ఆఫీసర్ వంటిమీద పోసేసి తన కోపం చల్లార్చుకున్నాడు, పేదవాడి కోసం పెదవికి చేటు అనేది నిజం కాదు, అతని కడుపు మండితే ఎంతకీ తెగిస్తాడు అన్నదే తన చేతుల్లో చేసి చూపించాడు, ఇది చూసిన సాటి చిరు వ్యాపారులు కొండంత సంతోషపడ్డారు. ఓవరాక్షన్ చేసిన ఆ ఆఫీసర్కి తగిన శాస్తి జరిగింది అంటూ, ఇతడి వ్యవహారం చూసినా స్థానికులు కామెంట్ చేశారు.