{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581194013298","total_editor_time":1,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581193963036","total_effects_time":0,"brushes_used":0,"height":2048,"layers_used":0,"width":4096,"subsource":"done_button"}

ఆమె పేరు ప్రీతి, మహిళా ఎస్సై, డ్యూటి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో ఎస్సై దీపాంశు తుపాకీతో కాల్చి చంపేశాడు, తానూ కొంత దూరం కారులో వెళ్లి, తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళా ఎస్‌ఐ శుక్రవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. ఆమె బ్యాచ్‌కు చెందిన మరో ఎస్‌ఐ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. 2018 బ్యాచ్‌కు చెందిన మహిళా ఎస్‌ఐ ప్రీతి అహ్లావత్‌ తూర్పు ఢిల్లీలోని పత్పార్‌గంజ్‌ ఇండిస్టియల్‌ ఏరియా పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకొని మెట్రో రైల్లో ఇంటికి బయలుదేరారు. సుమారు 9.30 గంటల సమయంలో రోహిణి ఏరియాలో రైలు దిగిన ఆమె సమీపంలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బాధితురాలి బ్యాచ్‌కే చెందిన దీపాంశుఅనే మరో ఎస్‌ఐ వెనుక నుంచి తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో బాధిత ఎస్‌ఐ తీవ్ర గాయాలతో ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచింది. హత్య అనంతరం నిందితుడు తన సొంత ప్రాంతమైన హర్యానాలోని సోనిపట్‌కు వెళ్లి తన కారులోనే అత్యహత్య చేసుకున్నాడు. తన ప్రేమను అంగీకరించక పోవడంతోనే దీపాంశు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ప్రీతి తూర్పు ఢిల్లీలోని పట్పర్‌గంజ్ ఇండస్ట్రియల్ ఏరియా పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తుంది. దీపాన్షు రతి కూడా సబ్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ రోహిణిలో రెంటుకుంటున్నాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. శవపరీక్ష కోసం ప్రీతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు నిమిత్తం ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు.