బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోతో పాపులర్‌ అయిన నటుడు దర్శన్పై, నటి సనంశెట్టి ప్రేమపేరుతో తనను మోసం చేశాడంటూ కేసుపెట్టింది. పెళ్లికూడా కుదుర్చుకొని ఇప్పుడు వేరే అమ్మాయిని చేసుకుంటున్నాడని చెప్పింది..

Advertisement

తమకు 2019 మేలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇరు కుటుంబాల సమ్మతితో జూన్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపింది. తనవద్ద 15 లక్షలు డబ్బు తీసుకున్నాడని ఆరోపించింది, దర్శన్‌కు బిగ్‌బాస్‌ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామన్నాడని, అందుకు తానూ అంగీకరించినట్లు చెప్పింది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత దర్శన్‌ మారిపోయాడని, పెళ్లిని ఆపేశాడని ఆరోపించింది. దర్శన్‌ తనకు నమ్మకద్రోహం చేశాడని సనంశెట్టి ఆరోపించింది.

కాగా దర్శన్‌ సనంశెట్టి ఆరోపణలపై స్పందించాడు. శనివారం అతను మీడియా ముందుకు వచ్చాడు. సనంశెట్టి ఇటీవల తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో ఒక రాత్రి అంతా గడిపిందంటూ పలు ఆరోపణలను చేశాడు. అలాంటి ఆమెను తానెలా పెళ్లి చేసుకుంటానని వ్యాఖ‍్యలు చేశాడు. సనంశెట్టిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదని దర్శన్‌ తేల్చి చెప్పాడు.