ఆరురి రమెశ్; రు.లక్ష పనికి 10 లక్షల ప్రతిపాదనలు వేయించి తొమ్మిది లక్షలు కాజేశాడు – శ్రీధర్

ఈ ఎన్నికల్లో వర్ధన్నపేట లో గెలిచి కాంగ్రెస్ జెండాను ఎగుర వేస్తామని మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు . వర్ధన్నపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తానేనంటూ పుణ్యాల క్రాస్ రోడ్డు నుంచి అయినవోలు ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు, అక్కడ పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు.

అనంతరం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీధర్ మాట్లాడారు, వర్ధన్నపేట తాజా మాజీ ఎమ్మెల్యే ఆరోరి రమేష్ అవినీతి అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపిస్తామని అన్నారు స్థానికేతరుడు అయిన ఇక్కడి సమస్యలు పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిగా స్థానికుడుగా ప్రజాసమస్యలు ఏంటో తెలుసునని కొండేటి శ్రీధర్ పేర్కొన్నారు, వర్ధన్నపేట నియోజకవర్గంలో రెండు వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకుంటున్న ఆరూరి ప్రచార సమావేశాల్లో అలా పై కూర్చొని ఓట్లు ఏమని ఎందుకు ప్రాధేయ పడుతున్నాడు చెప్పాలన్నారు. ఆయన చేసిన ప్రతి పనిలో ఉందన్నారు . రు.లక్ష పనికి రు.10 లక్షల ప్రతిపాదన వేయించి తొమ్మిది లక్షలు కాజేశాడని శ్రీధర్ ఆరోపించారు. ప్రతిదీ ఆయన బినామీ పేర్లతో చేసుకున్నాడని అన్నారు, అక్రమంగా సంపాదించిన ఆస్తులపై ఫిర్యాదు చేస్తే అధికార బలంతో తొక్కిపెట్టారు అన్నారు.

ప్రచారానికి వచ్చే టీఆర్ఎస్ నాయకులను అభివృద్ధిపై నిలదీయాలని పిలుపునిచ్చారు,? కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసి చూపిస్తుందన్నారు, వర్ధన్నపేట కాంగ్రెస్ టిక్కెట్ తనకు వస్తుందని , అందుకే మల్లన్న ఆశీస్సులతో ప్రచారాన్ని ప్రారంభించానన్నారు