జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా ఇచ్చి భారతదేశం తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడాన్ని పాకిస్తాన్ ఎప్పటికీ అంగీకరించదని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి మహ్మద్ ఫైసల్ అన్నారు. కాశ్మీర్ అంశం అనేది ఒక అంతర్జాతీయ వివాదానికి సంబంధించినది. ఈ వివాదంలో తాము కూడా భాగస్వామిగా ఉన్నామని ఓ ప్రకటను విడుదల చేసారు . ఆర్టికల్ 35 ఎ ను ఉపసంహరించుకోవాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం కాశ్మీర్ సమస్యను పునరావృతం చేసిందని వాఖ్యానించారు . భారత్ తీసుకున్న అక్రమమైన చర్యలను వ్యతిరేకిస్తున్నామని, దీనిని ఎదుర్కొడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసారు