రజనీకాంత్‌ కూతురు, స్టార్‌ హీరో ధనుష్‌ మాజీ భార్య ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్‌లో అడ్మిట్‌ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 20211 ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కాగా కొన్ని రోజుల క్రితమే ధనుష్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్‌-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.