ఆ రాసలీలల ఎమ్మెల్యే బండారం మరోసారి బయటపడింది. మరో మహిళా సర్పంచ్ తో ఆ ఉద్దేశంతో మాట్లాడడం.. ఆ ఆడియో రికార్డ్ అయ్యి ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ గోకుడు ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది..

సదురు ఎమ్మెల్యే రోమాంటిక్ వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు.. ఆయనకు మొదటి తెలంగాణ ప్రభుత్వంలో ఏకంగా మంత్రి పదవి ఇచ్చి పెద్దపోస్టునే కట్టబెట్టారు. అయితే ఈయన తెరచాటు రాసలీలల వ్యవహారాలు గుప్పుమనడంతో పదవి నుంచి తీసేశారు. అయితే అంతటితో ఆగితే అయిపోయేది. మంత్రి పదవి పోయినా మనవాడి వ్యవహారాలు మాత్రం సద్దు మణగలేదు.
మొన్నటి 2019 అసెంబ్లీ ఎన్నికల ముందర ఓ మహిళతో ఈ ఎమ్మెల్యే గారి ఆడియో ఎంత కలకలం రేపింది అందరికీ తెలిసింది. ఇన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ టికెట్ ఇవ్వడం.. టీఆర్ ఎస్ గాలిలో ఈయన గెలవడం జరిగిపోయింది.

అయితే రెండోసారి గెలిచాక కూడా ఆ ఎమ్మెల్యే తీరు మారలేదట.. తాజాగా ఆయన నియోజకవర్గంలోని ఓ మహిళా సర్పంచ్ కు ఫోన్ చేసి హైదరాబాద్ లో సర్పంచ్ లకు అవగాహన సమావేశాలు ఉన్నాయని.. ఒంటరిగా రా అంటూ ఎమ్మెల్యే వెకిలి మాటలు మాట్లాడాడట.. దీంతో ఖిన్నురాలైన ఆ మహిళా సర్పంచ్ ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. భర్త ఇదే జిల్లాకు చెందిన సీనియర్ మాజీ మంత్రికి విషయం తెలిపిందట.. దీంతో సదురు ఎమ్మెల్యేకు క్లాస్ తీసుకున్నాడట.. మాజీ మంత్రి ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళతా వార్నింగ్ అంటూ చెప్పేసరికి.. భయపడ్డ సదురు ఎమ్మెల్యే కొందరు పెద్దలను పంపి సారీ చెప్పి ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడట.. అలా ఆ మంత్రి రాసలీలల చేష్టలు ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి.