ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం

ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆత్మహత్యాయత్నం :సివిల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సంధ్య అనే అమ్మాయి ఈరోజు ఉదయం కాలేజీ హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన తెలంగాణ మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ లో జరిగింది. అదే కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న సంధ్య, ఉదయం హాస్టల్ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి కిందకి దూకింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


ఏసీ గ్యాస్ లీకై కుటుంబం మొత్తం మృతి