గోవా పర్యాటక ప్రియులకు శుభవార్త: ఇక కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి నేరుగా గోవాకు వెళ్లొచ్చు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి డిసెంబరు, జనవరి మాసంలో ఎక్కువగా గోవా వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తారు. రైల్వే శాఖ వారానికి ఒక రోజు కాజీపేట మీదుగా 17322/21 నంబరుతో వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ నడుపుతోంది. రెండు వారాలుగా ప్రయోగాత్మకంగా నడిపిన ఈ రైలును ఈ నెల 23వ తేదీ నుంచి రెగ్యులర్‌గా మార్చుతున్నారు. ఈ రైలు జార్ఖండ్‌లోని జసిదిహా నుంచి వాస్కోడగామకు వెళ్తుంది.

కాజీపేటలో ప్రతి మంగళవారం (17322) సాయంత్రం 16.10 గంటలకు వచ్చి వాస్కోడగామకు బుధవారం 14.40 గంటలకు చేరుకుంటుంది. శుక్రవారం అక్కడ 5.15 గంటలకు బయలుదేరి కాజీపేటకు మరుసటి రోజు ఉదయం 1.28 గంటలకు వస్తుంది. మంచిర్యాలలో కూడా హాల్ట్‌ కల్పించారు. స్లీపర్‌ క్లాసు, రెండు, మూడో తరగతి ఏసీ బెర్త్‌లు అందుబాటులో ఉంటాయి.