{"effects_tried":0,"photos_added":0,"origin":"unknown","total_effects_actions":0,"remix_data":[],"tools_used":{"tilt_shift":0,"resize":0,"adjust":0,"curves":0,"motion":0,"perspective":0,"clone":0,"crop":0,"enhance":0,"selection":0,"free_crop":0,"flip_rotate":0,"shape_crop":0,"stretch":0},"total_draw_actions":0,"total_editor_actions":{"border":0,"frame":0,"mask":0,"lensflare":0,"clipart":0,"text":0,"square_fit":0,"shape_mask":0,"callout":0},"total_editor_time":0,"brushes_used":0,"total_draw_time":0,"effects_applied":0,"uid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581192863508","total_effects_time":0,"source_sid":"9BC85F6E-C415-46CA-8663-D57C4E683F1C_1581193138409","sources":["307368906371201"],"layers_used":0,"width":4096,"height":2048,"subsource":"done_button"}

మండలంలోని మేడారంలో జరిగిన వనదేవతల మహాజాతర సందర్భంగా వివిధ కారణాల వలన సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకోని వారు బాధ పడవద్దు. భక్తులకు మరో అవకాశం ఉంది.

Advertisement

జాతర సందర్భంగా రద్దీ ఎక్కువగా ఉందని, మరే ఇతర కారణాల వలన మేడారం జాతరకు వెళ్ళలేక పోయామాని మదన పడుతున్నారా ? అలాంటి భక్తులు కోసం మరొక అవకాశం ఉండడం విశేషం. ఇదేమిటి అని సందేహించ కండి దర్శించుకోలేక పోయమని చింతించకండి. మరో అవకాశం ఉంది. అదే తిరుగు జాతర ఉందనే విషయం చాలా మందికి తెలియదు. సమ్మక్క సారలమ్మ దేవతలు వన ప్రవేశం చేసిన తర్వాత జాతర ముగిస్తుందనే భావన మన అందరిలో ఉండవచ్చు.

ఈ నెల 5 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు జరిగిన సమ్మక్క సారలమ్మల సందర్శించిన విశిష్టత తిరుగు జాతరలో దక్కుతుంది. ఆదివాసీ తెగువకు చెందిన సమ్మక్క వంశస్తుల నిర్వచనం మేరకు వచ్చే బుధ, గురు, శుక్ర వారాల్లో అనగా ఈ నెల12, 13,14 తేదీల్లో మేడారంలో తిరుగు జాతర జరుగుతుంది. తిరుగు జాతర సందర్భంగా కూడా సమ్మక్క సారలమ్మల అసలు జాతరకు దక్కిన ఆశీర్వాదం దక్కుతుంది.