కన్నపేగు కాటికిపోతుంటే ఉబికిన కన్నీటిలోనుంచి వచ్చిన పాట !! కన్నకొడుకు శవం ముందుపెట్టుకుని కన్నీళ్లతో కొడుకుకు ఇష్టమైన పాటపాడి కాటికి సాగనంపింది..

Advertisement

సూర‌జ్ తివారి ఓ జానప‌ద గాయ‌కుడు. అత‌ని త‌ల్లి పూన‌ర్ విరాట్ కూడా గాయకురాలు కావడం విశేషం. అయితే గత కొంతకాలంగా సూర‌జ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స అనంతరం కాస్త కోలుకున్న అతను నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో పాటపాడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు.

ఇక సూర‌జ్ అంత్యక్రియల సమయంలో పూన‌ర్ తన కుమారుడికి ఇష్టమైన ‘చోలా మాటి కే రామ్‌! ఏక‌ర్ కా భ‌రోసా’ పాటపాడి కడసారి వీడ్కోలు పలికారు. సూర‌జ్ స్నేహితులు డ‌ప్పులు వాయించారు. గద్గగ స్వరంతో పూన‌ర్ పాడిన పాటపై సోషల్‌ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చోలా మాటి కే రామ్‌ ఛత్తీస్‌గఢ్‌లో చాలా పాపులర్‌ పాట…