సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను లిఫ్ట్‌ అడిగి గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడిచేసి పారిపోయాడు.

Advertisement

బీరేందర్‌ మైథి ఐదున్నరేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. మూడేళ్ల క్రితం సంగీత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. మియాపూర్‌లోని లాగార్డీనేయ స్టూడియో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆర్‌బీఆర్‌ అపార్ట్‌మెంట్‌లో స్నేహితుడిని కలిసి తిరిగి 11.30 గంటల సమయంలో వస్తున్నాడు. ఈ-సేవ రోడ్డులో మంకీ క్యాప్‌ ధరించి ఉన్న గుర్తుతెలియని వ్యక్తి(25) లిఫ్ట్‌ అడిగాడు. అతడిని బైక్‌పై ఎక్కించుకొని వస్తున్నాడు. కొంతదూరం వెళ్లాక తను వేరే రూట్‌లో వెళ్లాలని వాహనం ఆపమన్నాడు. బైక్‌ ఆపగానే అతడు వీరేందర్‌ మెడపై కత్తితో ఐదుసార్లు పొడిచాడు. స్థానికులు అక్కడికి రావడంతో నిందితుడు పారిపోయాడు. గాయపడిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను స్థానికంగా గల ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.