ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సీనియర్ నేతలు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ ఎన్నికపై చర్చించారు. ఇద్దరి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం పోచారం వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇలా ఉండగా స్పీకర్ గా మాజీ వ్యవసాయ మంత్రిగా పనిచేసిన పోచారం శ్రీనివాసరెడ్డి నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ నేతలు ఏక వ్యాఖ్య తీర్మానం చేశారు. రాహుల్ నిర్ణయమే ఫైనల్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం TS అసెంబ్లీ ప్రాంగణంలో కెసిఆర్‌తో పోచారం భేటీ అయ్యారు. కాసేపట్లో పోచారం నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ మద్దతుతో ఏక గ్రీవంగా పోచారం ఎన్నిక కానున్నారు.