మిర్యాలగూడకు చెందిన అమృత చివరకు తన తల్లి గిరిజను కలిసింది. తన తండ్రి మరణించిన తర్వాత తల్లిని కలిసి తీవ్రంగా రోధించారు. అమృతకు బాబు పుట్టాడు. ప్రణయ్ చనిపోయిన తర్వాత అత్తవారింట్లోనే ఉంటున్న అమృతకు బాబు పుట్టాడు. ఆమె యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తుంది. మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్ హత్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అప్పట్లో ఈ పరువు హత్య ప్రజలందరికి చర్చనీయాంశం అయింది. ప్రణయ్ అమృతను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. తండ్రే హత్య చేయించడం గమనించదగ్గ విషయం. దాంతో అమృత స్వయంగా తండ్రిపై కేసు పెట్టింది. కేసు విచారణలో ఉండగా కొద్దిరోజుల తర్వాత అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య మరో సంచలనం సృష్టించింది. మారుతీరావు సూసైడ్ తర్వాత తండ్రిని చివరిసారి చూసేందుకు అమృత మిర్యాలగూడ వెళ్లింది. ఆమెపై దాడి జరుగవచ్చని అధికారులు పోలీసు భద్రతతో తండ్రిని చూడడానికి వెళ్లింది. దూరంగా తండ్రిని చూసి వెళ్లిపోయింది.

మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన తర్వాత అతని గదిలో ఒక లెటర్ దొరికింది. అందులో ‘అమృత అమ్మతో కలిసి ఉండు అమ్మను చూసుకో’ అని రాసిపెట్టి ఉంది. ప్రస్తుతం అమృత తన తల్లిని కలిసిన విషయం కూడా హాట్ టాపిక్‌గా మారింది. యూట్యూబ్ నిర్వహిస్తున్న అమృత తన కొడుకు మధుర జ్ఞాపకాలకు సంబంధించిన చిత్రాలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంది. తాజాగా తన తల్లితో కలిసి ఉన్న వీడియో కూడా యూట్యూబ్‌లో పెట్టింది. అందులో ఆరేళ్ల తర్వాత అమ్మను కలిశానని అమృత తెలిపింది. తల్లి గిరిజ కూడా సంతోషంగా ఉంది. అమృత తన బాబు, తల్లితో సంతోషంగా కనిపించింది. దీనితో అమృత తల్లితో కలిసారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నట్టింట వైరల్ అవుతోంది. దీనిని చూసి చాలామంది నెటిజన్లు అభినందిస్తున్నారు. నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. కానీ అమృత మాత్రం తన సర్వస్వం ప్రణయ్ అనే చెబుతుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.