పాకిస్తాన్ కు అమెరికా మొట్టికాయలు వేసింది ఓవర్ యాక్షన్ ఆపమంటూ హెచ్చరించింది. ఆర్టికల్‌ 370ని భారత్‌ రద్దు చేసిన తర్వాత పాకిస్థాన్ చూపిస్తున్న అత్యుత్సాహంపై అమెరికా స్పందించింది. భారత్‌తో వాణిజ్యం రద్దు, దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి చేర్చడం, హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా బహిష్కరణ తదితర అంశాలపై అమెరికా పాకిస్తాన్ ను మందలించింది. భారత్ చర్యలపై మాట్లాడేముందు ఎల్‌ఓసీలో అక్రమ చొరబాట్లకు మద్దతివ్వడం ఆపేయాలి. పాకిస్థాన్‌ గడ్డమీద ఉగ్రవాద మూలాలపై చర్యలు తీసుకోవాలి’ అని అమెరికా సలహా ఇచ్చింది. ‘జమ్మూకశ్మీర్‌లో పరిపాలన, కేంద్ర పాలిత ప్రాంతాలు తదితర అంశాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా గమనిస్తోంది. ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను మేం చూస్తూనే ఉన్నాం. పాకిస్థాన్‌ తన దూకుడును తగ్గించుకోవాలి అని కోరింది..