ఇలియానా తన నడుము అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టి టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో స్టార్ ఇమేజ్ దక్కించుకుంది. అయితే, ఇలియానా మనస్సు బాలీవుడ్ పై పడడంతో ముంబయికి మకాం మార్చింది. అయితే, అక్కడ పరాజాయాలు ఎదురుకావడంతో అమ్మడు అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కనిపిస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. ఇటీవల ఇలియానా, తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో అభిమానులతో ఛాటింగ్ చేసింది. వారితో తన సినిమాలు, ఇష్టాయిష్టాలు తదిత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో ఓ అభిమాని ఇలియానాను. ‘మీరు వర్జినిటీ ఎప్పుడు కోల్పోయారు?’ అని ప్రశ్నించాడు. దీంతో ఈ బ్యూటీ దిమ్మతిరిగేలా జవాబిచ్చింది. ‘వావ్.. ఈ ప్రశ్నకు మీ అమ్మ ఏమని చెబుతుంది!!’ అని కాస్త ఘాటుగానే సమాధానం ఇచ్చింది. ఇక, తన భాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నుంచి ఈ బ్యూటీ విడిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

దీంతో మళ్లీ సినిమాల్లో అవకాశాల కోసం దర్శక, నిర్మాతల చుట్టూ తిరుగుతోందని అయితే, బొద్దుగా ఉన్నావని, సన్నగా మారాలని సలహా ఇవ్వడంతో ఇప్పుడు జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తోందట. తాజాగా ఇలియానా మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై చిత్రయూనిట్ ఎలాంటి ఆధికారిక ప్రకటన చేయలేదు…